బడిబాట షెడ్యూల్ 2019 - 20 | **TG SCHOOLS**
MIS

బడిబాట షెడ్యూల్ 2019 - 20

బడిబాట షెడ్యూల్
ప్రతి రోజు ఉదయం 7.00 నుండి 11.00 గంటల వరకు బడిబాట కార్యక్రమంలో చేయవలసిన కార్యక్రమాలు
(a) అన్ని ఆవాస ప్రాంతాలలో ఇంటింటి సర్వే నిర్వహించుట. ర్యాలీలు నిర్వహించుట మరియు కరపత్రాలు పంచుట
(b) బడిఈడు పిల్లలను గుర్తించి బడిలో నమోదు చేయుట.
(c) నమోదు అయిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందజేయుట,
(d) తల్లిదండ్రులకు పాఠశాల యొక్క ప్రత్యేకతలు.

(e) రోజు వారీ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు మరియు తల్లిదండ్రులను భాగస్వాములను చేయుట.
(f) పాఠశాల పట్ల మరియు చదువు పట్ల ఇష్టం కలిగే విధంగా సంసిద్ధతా కార్యక్రమాన్ని నిర్వహించుట.
(g) గ్రామ విద్యా రిజిష్టరు (VER) ను అప్డేట్ చేయుట.
(h) ప్రత్యేకావసరాలు గల పిల్లలను (CWSN) ను గుర్తించి, భవిత కేంద్రాలలో చేర్పించుట.
(i) బాలకార్మికులకు విముక్తి కలిగించి ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేయుట.
(j) రోజు వారీ బడిబాట కార్యక్రమ వివరాలను (నమోదైన పిల్లలు, పాల్గొన్న ప్రజాప్రతినిధులు మొ|| వివరాలను) మండల విద్యాధికారి కి CRPs ద్వారా ప్రతిరోజు మ: 2.00 గంటలకు తప్పనిసరిగా తెలియజేయవలెను.

*బడిబాట రోజు వారీ కార్యక్రమాలు*
14-06-2019
*మొదటి రోజు : మన ఊరి బడి*
• పైన తెలిపిన విధంగా రోజువారీ కార్యక్రమాలను నిర్వహించాలి.
• ఆవాస ప్రాంతంలో బడిబాట ప్రాధాన్యత గుర్తించే విధముగా పాఠశాలను ఆకర్షణీయంగా అలంకరించుకోవాలి. ర్యాలీ నిర్వహించాలి మరియు కరపత్రాలు పంచాలి.
• తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి గుణాత్మక విద్యా సాధనకై చేస్తున్న కార్యక్రమాలు, విధానాలు, సౌకర్యాలు తెలియజేయాలి.
• పాఠశాల విద్యా కమిటీ మరియు ఉపాధ్యాయ బృందం కలిసి పాఠశాల అభివృద్ధికి వార్షిక కార్యచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి.
• పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, స్వచ్చంద సంస్థలు, పూర్వ విద్యార్థులు మరియు సమాజ సహకారంతో And అభివృద్ధిపరచుకోవాలి.
• పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుటకు మరియు నాణ్యమైన విద్యను అందించుటకు, విద్యా ప్రమాణాలు పెంపొందించుటకు తీర్మానాలు చేసుకోవాలి,
15-06-2019
*రెండవ రోజు : బాలికా విద్య*
• పైన తెలిపిన విధంగా రోజువారీ కార్యక్రమాలను నిర్వహించాలి.
• బాలికల ఆరోగ్య పరిరక్షణకై ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయబడుతున్న (Health and Hygiene Kit) ఆరోగ్య పరిరక్షణ కిట్ గురించి వివరించాలి..
• కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ ప్రత్యేక అధికారి జె.జి. వి. విలలో చేరుటకు అర్హత కలిగిన విద్యార్థినులు మరియు వారి తల్లిదండ్రులను ఆహ్వానించి, సాధ్యాలను గురించి తెలియజేయాలి.

• పాఠశాలల్లో బాలికల విద్య తీసుకోబడుతున్న ప్రత్యేక సౌకర్యాలు మార్షల్ ఆర్ట్స్ జీవన నైపుణ్యాలు, ప్రత్యేకావసరాలు గల బాలికలకు స్టయిఫండ్ మొదలగునవి) వివరించాలి.
• బాలికలలో ప్రత్యేక నైపుణ్యాలు కనబర్చిన లేదా ఫలితాలను సాధించిన వారిని గుర్తించి బహుమతులను లేదా ప్రశంసా పత్రములను అందజేయాలి.
• బాలికల విద్య ప్రాధాన్యతను తెలియజేసే విధంగా మహిళా అధికారులచే ఉపన్యాసాలు ఇప్పించాలి.
17-06-2019
*మూడవ రోజు సామూహిక అక్షరాభ్యాసం*
•పైన  తెలిపిన విధంగా రోజువారీ జార్చక్రమాలను నిర్వహించాలి.
• సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమమునకు గౌరవ ప్రకా ప్రతినిధులను ఆహ్వానించి అధి కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించాలి. బడిబాట ప్రాధాన్యతను మరియు చదువు యొక్క విశిష్టతను తెలియచేసే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకోవాలి.
• నూతనంగా నమోదైన పిల్లలందరూ వారి తల్లిదండ్రులతో సహా హాజరయ్యేలా చూడాలి.
• అక్షరాభ్యాసం కోసం కావాల్సిన సామాగ్రిని సమకూర్చుకోవాలి,
• ఉన్నత పాఠశాలల్లో నూతనంగా చేరిన పిల్లల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలి.
18-06-2019
*నాల్గవ రోజు : స్వచ్ఛ పాఠశాల / హరితహారం*
•  రోజువారీ కార్యక్రమాలను నిర్వహించాలి,
ప్రతి తరగతి గదిలో గల వృధా సామాగ్రిని తొలగించి శుభ్రం చేసుకోవాలి.
• పాఠశాల ప్రాంగణంలో పచ్చదనం పెంపొందించే విధముగా మొక్కలను నాటించుట మరియు నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలను ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కేటాయించాలి.
• పాఠశాల ప్రాంగణమును ఆకర్షణీయంగా సిద్ధం చేసుకోవాలి.
• మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలను వినియోగంలోకి తీసుకోవాలి,
• వాటర్ ట్యాంకను స్టీరింగ్ పౌడర్తో శుభ్రం చేయించుకోవాలి.

19-06-2019
*ఐదవ రోజు: పాఠశాల యాజమాన్య కమిటి / బాలకార్మికుల విముక్తి*
• పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులను భాగస్వామ్యం చేస్తూ డోర్ టు డోర్ సర్వే నిర్వహించడం.
• పాఠశాలలో నిర్వహించే పాఠశాల యాజమాన్య కమిటీలకు అందరూ హాజరయ్యే  విధంగా ఎస్ ఎస్ సి మెంబర్స్ చే తీర్మానాలు చేయించడం,
•  రోజువారీ కార్యక్రమాలను నిర్వహించాలి.
• ఆవాస ప్రాంతంలో గల బడిబయటీ బాల బాలికలను వారి తల్లిదండ్రులకు కలిసి వారిని బడిలో చేర్చుటకు ప్రణాళికను రూపొందించుకొని అమలు చేయాలి.

• పనికోసం వలస వచ్చిన వారి పిల్లలను గుర్తించి సమీపంలో గల పాఠశాలల్లో నేర్పించడం.
• మండల టాస్క్ ఫోర్సు కమిటీచే యాజమానుల నుండి బాలకార్మికులు విముక్తి కావించి పాఠశాలలో చేర్పించాలి..
• పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులను లెక్చరర్లను /ప్రొఫెసర్లను/ ఉద్యోగులను పాఠశాలకు మర్యాదపూర్వకంగా ఆహ్వానించి వారి సేవలను స్వచ్చందంగా పాఠశాల అవసరాలకు అనుగుణంగా వినియోగించుకొనవలెను.

Share this Post

Previous Post Next Post
No one has commented on this post yet
Click here to Comment

Type your Comment

comment url
MIS
MIS
MIS
MIS