PAN Card: మీ పాన్ కార్డ్ యాక్టీవ్‌గా ఉందా? చెక్ చేయండి ఇలా. | **TG SCHOOLS**
MIS

PAN Card: మీ పాన్ కార్డ్ యాక్టీవ్‌గా ఉందా? చెక్ చేయండి ఇలా.



                         మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? అసలు ఆ పాన్ కార్డ్ యాక్టీవ్‌గానే ఉందా? ఇది తెలుసుకోవడం చాలా సులువు. మీరే ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. కంప్యూటర్ లేదా ఫోన్  ఉంటే చాలు. మీ పాన్ నెంబర్‌ను వెరిఫై చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ ఈ అవకాశం కల్పిస్తోంది. దీన్నే పాన్ వెరిఫికేషన్ లేదా నో యువర్ పాన్ అంటారు.



ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పాన్ వెరిఫికేషన్ చేయొచ్చు. మీ పాన్ నెంబర్ యాక్టీవ్‌గా ఉంటే ఏ సమస్యా లేదు. ఒకవేళ మీ పాన్ నెంబర్ యాక్టీవ్‌గా లేకపోతే లావాదేవీల్లో సమస్యలు వస్తాయి. లేదా మీరు క్రెడిట్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశముంది.





             ఆన్‌లైన్‌లో పాన్ వెరిఫికేషన్ చేయండి ఇలా... ముందుగా ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ incometaxindiaefiling.gov.in ఓపెన్ చేయండి. ఎడమవైపు లిస్ట్‌లో Verify your PAN details ట్యాబ్ పైన క్లిక్ చేయండి.


                        కొత్త పేజీలో మీ పాన్ నెంబర్, పూర్తి పేరు, పుట్టిన తేదీతో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. చివరగా సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మీ పాన్ యాక్టీవ్‌గా ఉందో లేదో తెలుస్తుంది.


                 ఒకవేళ మీ పాన్ డీయాక్టివేట్ అయినట్టయితే ఆదాయపు పన్ను శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీ పాత పాన్ కార్డ్ జిరాక్స్‌తో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే మీ పాన్ నెంబర్ యాక్టివేట్ చేస్తారు



Share this Post

Previous Post Next Post
No one has commented on this post yet
Click here to Comment

Type your Comment

comment url
MIS
MIS
MIS
MIS